30.7 C
Hyderabad
May 5, 2024 05: 53 AM
Slider ముఖ్యంశాలు

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ లకు చుక్కెదురు

#hghcourt

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, అరబిందో హెటిరో ఛార్జిషీట్‌లో బీపీ ఆచార్యపై సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. తనపై అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదన్న బీపీ ఆచార్య వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అదేవిధంగా విశ్రాంత ఐఏఎస్‌ కృపానందం పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో కృపానందం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. ఈ క్రమంలో రఘురాం సిమెంట్స్‌ ఛార్జిషీట్‌ కొట్టివేయాలన్న కృపానందం అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు నిర్ణయాల్లో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని,  జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Related posts

ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్వాసన?

Satyam NEWS

ఫేక్ ఫైర్ :సింగపూర్లోలోవిమాన రాకపోకలకు అంతరాయం

Satyam NEWS

బీజేపీ ఇంతేనా… ఇక చాలునా?

Satyam NEWS

Leave a Comment