40.2 C
Hyderabad
May 2, 2024 18: 50 PM
Slider ముఖ్యంశాలు

ఏడేళ్ల హరితహారానికి రూ.10వేల కోట్లు ఖర్చు

#kcr

హరితహారం అంటే తొలినాళ్లలో కాంగ్రెస్‌ నేతలు జోకులేశారని, కానీ, ఇవాళ దానివల్లే తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. గత ఏడేళ్లలో హరితహారం కోసం రూ. 10వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ అన్నారు.

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిo చింది ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని,

గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. విడిపోతే తెలంగాణ నాశనం అవుతుందని అన్నారు. కానీ, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందన్నారు.

గోదావరి నీటిని వందల ఫీట్లువేసినా బోర్లలో నీళ్లు పడేవి కావని, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్‌ అడ్డుకుందన్నారు . కానీ, ఆ ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యతతో పాటు గోదావరి నీటిని గండిపేట, హిమాయత్‌ సాగర్‌కు లింక్‌ చేస్తాం. చెవేళ్ల ప్రాంతానికి మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని తుమ్మలూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే శంషాబాద్‌ నుంచి మహేశ్వరం వరకు మెట్రో మార్గం పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

“ఆరోగ్య మహిళ”కు విశేష స్పందన: మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

Murali Krishna

కామెంట్: దేవుడిపై కూడా జగన్ కు నమ్మకం లేదు

Satyam NEWS

Leave a Comment