40.2 C
Hyderabad
April 28, 2024 16: 32 PM
Slider కర్నూలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

#srisailam

శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా  చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో  లోటుపాట్లు లేకుండా  అన్నిరకాల ముందస్తు  జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ  రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో  కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి 1 నుండి 11 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేలికగా మల్లన్న దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు బాధ్యతాయుతంగా అధికారులకు అప్పగించిన పనులను  నిర్వహించారు.  ప్రధానంగా క్యూలైన్లు,  త్రాగునీటి సదుపాయం, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

శివదీక్షా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొకుండా సమగ్ర ప్రణాళికలు  రూపొందించాలని, కార్యనిర్వహణాధికారివారిని సూచించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌కు వివరించారు. మార్చి 8వతేదీ మహాశివరాత్రిపర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం  అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ,  లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం  తదితర వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు.

11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు  దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో టోల్‌గేట్, వలయ రహదారి ( రింగురోడ్డు) యజ్ఞవాటిక పార్కింగు ప్రదేశం, మల్లమ్మ కన్నీరు ప్రాంతం.  జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రక్కన గల పార్కింగు ప్రదేశం, ఆర్టీసీ బస్టాండు ప్రాంతం మొదలైన ప్రదేశాలను పరిశీలించారు. అన్ని పార్కింగు ప్రదేశాలలో కూడా అవసరమైన సదుపాయాలు ఉండాలన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్‌ కలెక్టర్ రాహుల్ మీనా,  డి.ఆర్.ఓ పద్మజ,  ఆత్మకూరు ఆర్‌డిఓ మిరియాల దాసు, అన్ని శాఖల జిల్లా అధికారులు,  మార్కాపురం, దోర్నాల,  తెలంగాణా, కర్ణాటక ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఉద్యమ జ్యోతి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి

Satyam NEWS

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నేతలు

Satyam NEWS

జులై 9 నుంచి ఆషాఢ బోనాలు

Bhavani

Leave a Comment