36 C
Hyderabad
May 13, 2025 12: 00 PM
Slider మహబూబ్ నగర్

ఎలర్ట్: కొల్లాపూర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు

Kollapur CI

కొల్లాపూర్ పట్టణంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 144వ సెక్షన్ ను కొనసాగించేందుకు పోలీసులు నిర్ణయించారు. రేపు కొల్లాపూర్ మునిసిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. అదే విధంగా కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది.

ఈ రెండు కార్యక్రమాల దృష్ట్యా కొల్లాపూర్ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు వీలుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా 144వ సెక్షన్ విధించినట్లు కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి తెలిపారు. ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండటం, ఊరేగింపులు తీయడంపై నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన అందరికి సూచనలు జారీ చేశారు.

Related posts

టీఆర్ఎస్ పక్కలో డైనమైట్ వచ్చి చేరింది

Satyam NEWS

ఫరీనా బేగం కు మ‌ద్ద‌తుగా విరాళాల సేక‌ర‌ణ‌

Sub Editor

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!