37.2 C
Hyderabad
May 6, 2024 14: 26 PM
Slider నల్గొండ

200 కోట్ల అమ్మకాలు

#munugodu

మునుగోడు ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారింది. ఉప ఎన్నిక తప్పనిసరి అని తెలిసినప్పటినుంచి పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తగినంత మద్యం పోయించి మత్తులో ముంచెత్తాయి. ఇప్పుడు ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా మద్యంత సీసాలు కనిపిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం మొత్తం మందులో మునిగిపోయింది. దాదాపు రూ. 200  కోట్లకు పైగా మద్యం తాగినట్లు ఇక్కడ అధికారులు అంచనా వేశారు. మామూలుగా ప్రతి నెల నల్గొండ జిల్లా వ్యాప్తంగా రూ. 132 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. కానీ ఈనెల రూ. 2వందల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఓటర్లను ప్రలోభానికి గురిచేయడానికి మద్యం ఎక్కువగా పంపిణీ చేశారు. మునుగోడు ఓటర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడ కూడా ఆత్మీయ సమ్మేళనాలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఆ మద్యాన్ని కూడా కలుపుకుంటే మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల కోసం దాదాపు రూ. 3 వందల కోట్లకుపైగా మద్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.  నల్గొండ జిల్లా తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా మద్యం ఇక్కడకు సరఫరా అయినట్లు తెలుస్తున్నది.

Related posts

ముందు నుండి వైసిపి, వెనుక నుండి బిజేపి వెన్నుపోటు

Satyam NEWS

నల్లగొండ లో వినాయక మండపాలకు అనుమతి లేదు

Satyam NEWS

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పంటలు

Satyam NEWS

Leave a Comment