23.2 C
Hyderabad
May 7, 2024 20: 28 PM
Slider హైదరాబాద్

34 మంది విద్యార్ధుల సస్పెండ్

#pvuniversity

హైదరాబాద్ నగరంలో వున్న పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ర్యాంగింగ్‌కు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు అధికారులకు  ఫిర్యాదు చేశారు. దీంతో 34మంది సీనియర్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్‌ చేసింది. వీరిలో 25మందిని తరగతులు, మరో తొమ్మిది మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు.

Related posts

మంత్రి రాక‌తో రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం

Sub Editor

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి

Satyam NEWS

బాలికల అనాధ బాల సదనంకు కలెక్టర్ శర్మన్ విరాళం

Satyam NEWS

Leave a Comment