41.2 C
Hyderabad
May 4, 2024 17: 52 PM
Slider ముఖ్యంశాలు

విజయనగరం పోలీస్ స్పంద‌న‌: రికార్డు స్థాయిలో 33 ఫిర్యాదులు…..!

#spandana

సామాన్యుల గోడు వినేందుకు”  స్పంద‌న‌”…. పేద‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు ” ” స్పంద‌న‌”…స్టేష‌న్ ల‌లో సిబ్బందికి వినిక‌పోతే” స్పంద‌న‌”ఇలా ఏ స‌మ‌స్య అవ్వ‌నివ్వండి….త‌మ గోడు, బాధ‌…ఆవేద‌నల‌ను చెప్పుకునేందుకు ప్ర‌తీ సోమవారం  పోలీస్ శాఖ నిర్వ‌హిస్తున్న పరిష్కార వేదిక‌…” స్పంద‌న”.

జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లా ఎస్పీ.దీపిక “స్పందన” కార్యక్రమాన్ని తీసుకున్నారు.అయితే  ప్ర‌తీ వారం  అడ్మిన్ ఏఎస్పీ స‌త్య‌నారాయ‌ణ‌కు బ‌దులు…ఈ వారం లా అండ్ ఆర్డ‌ర్…ఏఎస్పీ ,విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ ..హాజ‌ర‌య్యారు.ఈ మేర‌కు అటు ఎస్పీ,ఇటు ఏఎస్పీలు.. స్పంద‌న‌కు వ‌చ్చే బాధితుల‌ నుండి ఫిర్యాదులు స్వీక‌రించారు. వారి సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో అక్క‌డిక్క‌డే ఫోనే లో మాట్లాడారు. చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు  న్యాయం చేయాలని ఆదేశించారు.

వివ‌రాల్లోకి వెళితే….

విజయనగరం  కుసుమగజపతినగర్ కు   చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేస్తూ తను ఒక చిట్ కంపెనీలో నెలా నెలా చిట్ అమౌంట్ కట్టినట్లు, చిట్ కాలం పూర్తి అయిన్పటికీ తన అమౌంట్ ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇప్పించి తనకు న్యాయం చేయాలని కోరారు.

డెంకాడ మండలం, బంటుపల్లికి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు తనకు గల భూమిని తమ ఆర్ధిక అవసరాల నిమిత్తం ఒక వ్యక్తికి అమ్మడం జరిగిందిని, తమ బంధువులు సదరు భూమిపై ఫోర్జరీ సంతకములతో తప్పుడు పురోణి సృష్టించి, ఇబ్బందులు కలుగుచేస్తున్నట్లు, వారిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరారు. .

కొత్తవలసకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదుచేస్తూ అప్పన్నదొరపాలెం గ్రామ పరిధిలో తనకు కొంత భూమి ఉన్నట్లు, సదరు భూమి ప్రక్కనే భూమి ఉన్న ఆసామి తన భూమిని ఆక్రమించుకొని తన భూమిలో కలుపుకోవాలని చూస్తున్నట్లు తనకి న్యాయం చేయాలని కోరారు.

విజయనగరం వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి వద్దనుండి తను, తన భర్త చెక్, ప్రామసరీ నోటు హామీగా ఇచ్చి కొంత డబ్బులు అప్పుగా తీసుకొని, సదరు అప్పు తిరిగి తీర్చివేసినట్లు, అయినప్పటికీ వ్యక్తి తను ఇచ్చిన చెక్, ప్రామసరీ నోటు తిరిగి ఇవ్వడంలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు.

రాజాం మండలం, గురవాంకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి  ఫిర్యాదు చేస్తూ తనభార్య పేరున తమ గ్రామంలో కొంత మెట్టు భూమి ఉన్నట్లు, సదరు భూమిని అదేగ్రామానికి చెందిన ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఇలా ఒక్క రోజే 33 మంది బాధితులు…త‌మ‌,త‌మ స‌మ‌స్య‌లతో జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి రావ‌డంతో వారి బాధ‌ల‌ను సావ‌ధానంగా విన్న  ఎస్పీ,ఏఎస్పీలు… స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు  రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్చార్జి అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, డిసిఆర్బి సిఐ డా బి. వెంకటరావు, ఎస్బీ సీఐలు జి.రాంబాబు, సి.హెచ్. రుద్రశేఖర్, ఎస్ఐ లు కృష్ణవర్మ, మురళి  మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీ కి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

Satyam NEWS

నుమాయిష్ లో తెలంగాణ అటవీశాఖకు మొదటి బహుమతి

Bhavani

చిన్న జియర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

Leave a Comment