34.2 C
Hyderabad
May 10, 2024 14: 12 PM
Slider హైదరాబాద్

నుమాయిష్ లో తెలంగాణ అటవీశాఖకు మొదటి బహుమతి

#Minister Mahmood Ali

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో మొదటి బహుమతి లభించింది. ఎగ్జిబిషన్ – 2023 ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు ఈ బహుమతిని అందుకున్నారు.

ప్రభుత్వ శాఖలు, పథకాల అమలు ప్రదర్శన, మంచి అలంకరణ విభాగంలో తెలంగాణ అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ఈ బహుమతి దక్కింది. ప్రతీయేటా జరిగే ఎగ్జిబిషన్ లో తెలంగాణ అటవీశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన, మినీ జూతో కూడిన స్టాల్ ను ఏర్పాటు చేస్తుంది.

ఈసారి అడవి, వన్యప్రాణుల థీమ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన సందర్శకులు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈయేడు కూడా సమర్థవంతగా స్టాల్ ను నిర్వహించి బహుమతి గెలుచుకున్న అధికారులు, సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ అభినందించారు.

Related posts

తెలంగాణ లో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

పేదల కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది

Satyam NEWS

ఏ ఎస్ రావు నగర్ లో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment