Slider విజయనగరం

ఆక‌లి బాధ‌ను గుర్తించిన 1982 ఆర్సీఎం టెన్త్ బ్యాచ్….!

#oldstudents

అన్నార్తులకు ప‌ట్టెడు అన్నం పెడుతున్న పూర్వ‌విద్యార్ధులు….!

వీధిలో “అమ్మా మాధ‌వ కోళం త‌ల్లీ” అంటేనే గాని ఇంట్లో  ఉండే ఇల్లాలు…ప‌ట్టెడు అన్నం పట్ట‌ని స్పీడ్ రోజుల‌వి.కానీ  మ‌హ‌మ్మారి క‌రోనా పోయి….ఇప్పుడిప్పుడే ఎవ‌రికి వారు త‌మ ,త‌మ  నిత్యం జీవితంలోకి వ‌చ్చి…ఉరుకులు,ప‌రుగులతో  త‌మ‌,త‌మ కుటుంబ పోష‌ణ కోసం….బ‌య‌ట‌కు వెళుతున్నారు…ప్ర‌తీ ఒక్క‌రు.

కాని…ఆ ప‌ట్టెడు అన్నం కోసం…. సంపాదించుకోలేని అభాగ్యులు.. ఎంద‌రో ఉన్నారీ స‌మాజంలో.అటువంటి వారి కోసం…చాలా చోట్ల చాలా ప్రాంతాల‌లో స్వ‌చ్చంద సంస్థ‌లు వెలిసి…చందాలు వేసుకుని…త‌మ ప్రాపకం కోసం…గొప్పకోసం… ప్ర‌చారం చేసుకుంటూ మ‌రీ కొన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.కానీ…1982 లో పార్వ‌తీపురం  ఆర్సీఎం హైస్కూల్ లో టెన్త్ చ‌దివిన బాయ్స్ అంద‌రూ క‌లిసారు.

ఓ బృహ‌త్త‌ర‌మైన‌,స‌మాజ‌హిత‌మైన‌న, సేవా కార్య‌క్ర‌మాలకు శ్రీకారం చుడ‌తామ‌ని…ఇటీవ‌లే  స‌మావేశమై నిర్ణ‌యించుకున్నారు. ఇక అక్క‌డ నుంచీ  పదిహేను రోజ‌ల‌కొక‌సారి.అలాగే నెల రోజుల కొక‌సారి.. పార్వ‌తీపురం ప‌ట్ట‌ణంలోఉన్న  1982  ఆర్సీ ఎం  బ్యాచ్ లో ఉన్న కొంత‌మంది… కొన్ని సేవా కార్య‌క్ర‌మాల‌న శ్రీకారం చుట్టారు. ఇటీవ‌లే మండ‌టెండ‌లో  చ‌లివేంద్రాన్ని ప్రారంభించింది.

అలాగా ఆమ‌ధ్య అనాధ‌ల‌కు  భోజ‌న స‌దుపాయం క‌ల్పించింది. తాజా…. మాడు ప‌గులుతున్న ఎండ‌లో మ‌జ్జిక పంప‌ణీ తో పాటు…అభాగ్యుల ఆక‌లి మంట‌ను…పులిహోర పంపిణీ  చేసి తీర్చింది…1982 పార్వ‌తీపురం ఆర్సీఎం టెన్త్ బ్యాచ్. ఆ బ్యాచ్ కు హేట్సాప్ చెబుతోంది…వార్తావ‌ళి.ఈ కార్య‌క్ర‌మంలో  చింతాడ  విశ్వం, రెడ్డిశ్రీను, రాంబట్లశ్రీను, కొట్నిశ్రీను, కె.సత్యంనారాయణ, వై.భాస్కరరావు, పైలి రాజు,  రాయపురెడ్ది,  ఉదయభాస్కర్,  రాజు,  మీసాల కూర్మారావు,బీఎస్ సాయి కుమార్ లు త‌మ‌,త‌మ  సేవానిర‌తిని చాటుకున్నారు.

Related posts

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

Satyam NEWS

భద్రాచలం  ఆర్డీఓ గా రత్నకల్యాణి

Murali Krishna

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

Leave a Comment