30.7 C
Hyderabad
May 5, 2024 03: 53 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హునార్ హాట్ ప్రారంభo

#hunarhaat

క్రాఫ్ట్, వంటకాలు, సంస్కృతి సమ్మేళనం హునార్ హాట్ 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వందలాది మంది కళాకారులు, హస్తకళాకారులతో కూడిన “హునార్ హాట్”ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైదరాబాద్‌లో ప్రారంభించింది. నేటి నుంచి మార్చి 6 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఇందులో మొత్తం 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

అయితే దీని అధికారిక ప్రారంభోత్సవం 27న జరుగుతుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దీన్ని ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ హాజరుకానున్నారు.  స్టాల్స్‌తో పాటు, హునార్ హాట్‌లో రాంబో ఇంటర్నేషనల్ సర్కస్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో  30 మంది సర్కస్ కళాకారులు అద్భుత విన్యాసాలు చేయనున్నారు. 

ప్రతి రోజు మధ్యాహ్నం 1,3,6 గంటలకు సర్కస్ షోలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ముంబై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొనే ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.  ప్రముఖ నేపథ్య గాయకుడు సురేష్ వాడ్కర్, గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్, సుదేశ్ భోంస్లే, అల్తాఫ్ రాజా, నూరా సిస్టర్స్ గానంతో పాటు పలువురు కళాకారులు ఇందులో పాల్గొంటారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో హస్తకళాకారులు కళలు ఇక్కడ ప్రదర్శిస్తారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హునార్ హట్ లను నిర్వహిస్తున్నారు.

Related posts

పల్లె రాజకీయ ముఖచిత్రంలో కన్వీనర్లే కీలకం

Bhavani

రాజధాని ఢిల్లీకి శీతలగాలుల ప్రమాదం

Satyam NEWS

ఉద్యోగులు ఛీ కొడుతున్నారు ఇక సజ్జలను ఇంటికి పంపించండి

Satyam NEWS

Leave a Comment