39.2 C
Hyderabad
April 28, 2024 12: 20 PM
Slider ముఖ్యంశాలు

ఉద్యోగులు ఛీ కొడుతున్నారు ఇక సజ్జలను ఇంటికి పంపించండి

#navataramparty

ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని ఇంటికి పంపించాలని, ఆయన స్థానంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు సలహాదారులు గా అవకాశం కల్పించాలని, తద్వారా పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం సూచించారు.

విజయవాడలో జరిగిన ఉద్యోగుల ర్యాలీ విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని పీఆర్సీ జీవోలు రద్దుకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమ్మె సైరన్ రాష్ట్రంలో ప్రజలకు భయం కలిగించింది అని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని, సమ్మెను ఆపాలని అన్నారు.

వేతన సవరణ సంఘం ఉద్యోగుల మేలుకోసం పని చేయాలని కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి వల్ల జీవోలు ప్రక్కదారి పడుతున్నాయి అన్నారు.ఉద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున జరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణం అన్నారు.ఇప్పటికీ ముఖ్యమంత్రి చర్చించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని ఆదిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు చేయాలని  రావు సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు.

Related posts

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి

Satyam NEWS

Professional What Homeopathic Remedy Can I Get For High Blood Pressure What If Your Cholesterol Is High Resistance Training Can Lower Blood Pressure As Much As

Bhavani

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చీఫ్ సెక్రటరీ SK జోషి

Satyam NEWS

Leave a Comment