42.2 C
Hyderabad
April 30, 2024 16: 55 PM
Slider ఆధ్యాత్మికం

మేళ్లచెరువు జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

#mellacheruvu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచేరువు మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి మహాశివరాత్రి జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు,ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

మహాశివరాత్రి జాతర ప్రాంతాన్ని శుక్రవారంనాడు సందర్శించి పార్కింగ్ ప్రాంతాలు,రోడ్డు మార్గాలు పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై, జాతర నిర్వహణపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. భక్తులు,ప్రజలు జాతరను, ఉత్సవాలను భక్తి శ్రద్ధతో నిర్వహించుకోవాలని,ఎవ్వరూ గొడవలు, తగాదాలు పెట్టుకోవద్దు అని అన్నారు. జాతర ప్రాంతంలో అసాంఘీక చర్యలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు.దేవాలయం సిబ్బంది,స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పని చేస్తామని అన్నారు.భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాలయ సిబ్బందిని ఆదేశించారు.

జాతరకు వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి వచ్చి వెళ్ళే అన్ని ప్రధాన మార్గాల్లో పార్కింగ్ ప్రదేశాలు, హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశాం అన్నారు. బారికెడ్స్,సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేశామని,జాతరను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపినారు. స్పెషల్ టీమ్స్ గస్తీ నిర్వహిస్తాయని,మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని,జాతర ప్రాంతంలో పోలీస్ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెంట అధనపు ఎస్పీ రితిరాజ్ దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి,అధికారులు,స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్,ఎస్సై రవీందర్,స్థానిక అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తండ్రి కుమార్తెను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Satyam NEWS

ప్రచార ఆర్భాటాలు తప్ప చర్యలు శూన్యo

Bhavani

కొమురవెళ్లి మల్లన్న గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Satyam NEWS

Leave a Comment