34.2 C
Hyderabad
May 13, 2024 18: 11 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి ఎన్నికల బరిలో 39 మంది: జిల్లా వ్యాప్తంగా 67 మంది

#kamareddy

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బరిలో 67 మంది నిలవగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది బరిలో ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 64 బరిలో ఉండగా ఇందులో ఆరుగురు అభ్యర్థులు తిరస్కరణకు గురి కాగా నేడు 19 మంది నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకోగా 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎల్లారెడ్డి నియజకవర్గంలో 16 మంది అభ్యర్థులకు బరిలో ఉండగా 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నేడు మరో ముగ్గురు నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది బరిలో నిల్చున్నారు.

జుక్కల్ నియోజక వర్గంలో 30 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయగా 6 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. నేడు మరో 7 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజాల సురేందర్, మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో హన్మంత్ షిండే, లక్ష్మీకాంతరవు, అరుణతారల మధ్య పోటీ నెలకొననుంది

ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు

కామారెడ్డి నియోజకవర్గం

1.లింగాల ముత్యం

2.శివరాములు సాప

3.కలరాం అశోక్ వర్ధన్

4.గరిడే వెంకట్రావు

5.చిట్టిబోయిన నటరాజ్

6.చిట్టిబోయిన సులోచన రాణి

7.చిదుర సాగర్ రెడ్డి

8.చెట్పల్లి బాలరాజు

9.నిఖిల్ రెడ్డి

10.పప్పు రాజు

11.బిట్ల రాజయ్య

12.బుట్టేంగారి మాధవరెడ్డి

13.బెల్లాపురం సతీష్ కుమార్

14.అవుసుల బ్రహ్మం

15.మహేందర్ రెడ్డి పెంజర్ల

16.రవికుమార్ చాలిక

17.పి.రాజేష్

18.సుదర్శన్ ఆంద్రపు

19.సైదుగారి అశోక్ కుమార్

ఎల్లారెడ్డి నియోజకవర్గం

1.పెద్ద మహేష్ అలియాస్ మోడిగామ మహేష్

2.నేనావత్ బద్యా నాయక్

3.బంతిలాల్ మంజ

జుక్కల్ నియోజక వర్గం

1.రాంచందర్ బుక్కవార్

2.గంగారాం సౌదాగర్

3.రేవన్  సర్దేవార్

4.కరోళ్ల  మోహన్

5.బక్కవార్ సాయిలు

 6.సారిక మక్కాయ్

7.గంగారాం

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఎనాలసిస్: కరోనా నేర్పిస్తున్న కొత్త పాఠాలు

Satyam NEWS

తెలంగాణ జాతీయసమైక్యతా దినంగా సెప్టెంబర్ 17

Bhavani

రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Bhavani

Leave a Comment