38.2 C
Hyderabad
May 2, 2024 19: 14 PM
Slider ఆదిలాబాద్

రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#Minister Indrakaran Reddy

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్‌ జంగల్‌ జమీన్ స్పూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

బుధ‌వారం కుబీర్ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో గిరిజ‌నుల‌కు పోడు ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 ల‌క్ష‌ల‌ మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఇకపై పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామని, ప‌ట్టాదారులు త‌మ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థిక స‌హాయం అందిజేస్తామ‌ని వెల్ల‌డించారు.

త్రీ ఫేజ్ క‌రెంట్ కూడా స‌ర‌ఫరా చేస్తామ‌ని చెప్పారు. పోడు రైతుల‌పై ఉన్న కేసుల‌ను కూడా ప్ర‌భుత్వం ఎత్తివేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. హ‌క్కుదారులు త‌మ భూముల‌ను అమ్ముకోవ‌డానికి వీలు లేద‌ని, వార‌సుల‌కు మాత్ర‌మే పోడు భూముల‌పై హ‌క్కులు ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఏజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, క‌లెక్ట‌ర్ వ‌రుణ్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related posts

మానవత్వం చాటుకున్నఉమ్మడి పాలమూరు జర్నలిస్టులు

Bhavani

ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

Satyam NEWS

40 ఏళ్లు కష్టపడ్డ చిన్నారెడ్డికి కాకుండా 40 రోజుల కింద చేరిన వారికి టికెట్టా?

Satyam NEWS

Leave a Comment