27.7 C
Hyderabad
May 15, 2024 06: 45 AM
Slider జాతీయం

తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పరువు

#akantony

కాంగ్రెస్ పార్టీకి ఇది చావు దెబ్బ. ఆ పార్టీకి ఉన్న పరువు కాస్తా పోయినట్లు అయింది. ఎందుకంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పార్టీ కోసం పని చేసిన ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ, ఒక భారతీయ యువకుడిగా, దేశ నిర్మాణం మరియు జాతీయ సమైక్యతపై ప్రధానమంత్రి దృష్టికి సహకరించడం నా బాధ్యత మరియు కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు.

BBC డాక్యుమెంటరీ ఇటీవల వచ్చిన తర్వాత, అనిల్ కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీని గురించి అనిల్ సోషల్ మీడియాలో కూడా స్పందించారు. ఆ తర్వాత చాలా మంది కాంగ్రెస్ నాయకులు అతనిని విమర్శించారు. దీంతో అనిల్ ఆంటోనీ తన పోస్టులన్నింటినీ డిలీట్ చేశాడు. అయితే భారతీయ సంస్థలపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను ప్రదర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన స్థిర నిర్ణయంతో ఉన్నారు. నేడు ఆయన బీజేపీలో చేరారు.

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Murali Krishna

రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment