37.2 C
Hyderabad
May 1, 2024 14: 20 PM
Slider నెల్లూరు

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

#vikramsimhapuriuniversity

నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాగణంలోని శ్రీ పొట్టి శ్రీరాముల భవనంలో మహాత్మాగాంధీ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపకులతి ఆచార్య జి యం సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఈనాటి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం అని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు అని అన్నారు. ఆ మహనీయుని వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటామని, సర్వజన హితం నా మతం…అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం జాతిపిత మహాత్మా గాంధీ మాటలని వివరించారు.

నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు.1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద నిండా ద్వేషాన్ని నింపుకున్న నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచాడు.

ఇవాళ ఆ మహాత్ముడి 74వ వర్ధంతి. మహాత్ముడి వర్ధంతి రోజును దేశం మొత్తం షహీద్ దివస్‌గా జరుపుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ విజయ, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి, సహాయక రిజిస్ట్రార్ డాక్టర్ సుజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మహాత్మాగాంధీ చిత్ర పటానికి నివాళులర్పించారు.

Related posts

అక్టోబరు 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

Satyam NEWS

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS

సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీల డోలీయాత్ర

Bhavani

Leave a Comment