37.7 C
Hyderabad
May 4, 2024 13: 13 PM
Slider ప్రకాశం

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

#inhumane incident

ఒంగోలు జిల్లా లో నెలరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి చావబాది, నోట్లో మూత్రం పోశారు కొంతమంది యువకులు. తీవ్ర గాయాలతో, రక్తమోడుతుండగా బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదు.

నిందితులు, బాధితుడు జులాయిలు కావడం, చోరీలకు పాల్పడేవారు కావడంతో పోలీసులు లైట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడ్ని చితకబాది, నోట్లో మూత్రం పోసిన దృశ్యాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.

ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హాడావిడిగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన కొంతమంది యువకులు జులాయిలుగా తిరుగుతూ ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఇళ్ళల్లో చోరీలకు పాల్పడుతూ దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు నవీన్‌, అంజిల మధ్య చిన్నపాటి గొడవ మనస్పర్దలకు దారి తీసింది.

ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఒంగోలు శివారులో వీరిద్దరితో పాటు మరికొంతమంది యువకులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న అంజి తనతో గతంలో గొడవపెట్టుకున్న నవీన్‌పై గొడవకు దిగాడు.

అతనికి మిగతా యువకులు సహకరించారు. నవీన్‌ను విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తం కారుతూ నవీన్‌ విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. పైశాచికత్వం ఇంకా కట్టలు తెంచుకుంది. బాధితుడిపై మూత్రం పోశారు.

నోట్లో మూత్రం పోసి, తాగాలంటూ చావగొట్టారు. తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వినిపించుకోలేదు. బూతులు తిడుతూ కసిగా కొట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని తమ దగ్గర ఉన్న సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. ఈ ఘటన జరిగిన తరువాత బాధితుడు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

బాధితుడు, నిందితులు అంతా నేర ప్రవత్తి కలిగి ఉండటం, అంతా దొంగలేనని, వీరి మధ్య గొడవలు సాధారణమేనన్నట్టు లైట్‌ తీసుకున్నారు. అయితే నెల రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను నిందితుల్లోనే కొంతమంది సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related posts

దీపావళి ఉత్సవ నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు

Satyam NEWS

సిఎఎ ఫైర్:జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో ఇరువర్గాల ఘర్షణ

Satyam NEWS

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

Satyam NEWS

Leave a Comment