31.7 C
Hyderabad
May 6, 2024 23: 31 PM
Slider నల్గొండ

అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్య తీసుకోవాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూ ర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నల్లగొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్  మండల ఎంఈఓ సైదా నాయక్ కి వినతి పత్రం అందజేసిన నరేందర్ గౌడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజు వసూలు చేస్తున్నాయని,షూ,టై,బెల్ట్, యూనిఫారం,పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్ అమ్మకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా అమ్మకాలు జరుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు.ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరకు వేసిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తిరుపతిరావు కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షుడు బెల్లంకొండ రామజోగి,రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

నేరస్థులకు శిక్షపడే విధంగా కృషి చేయాలి

Murali Krishna

వైన్స్ షాపుల వద్ద మద్యం ప్రియుల భారీ క్యూ

Satyam NEWS

జ‘గన్’ హామీలపై రఘురామ గన్

Satyam NEWS

Leave a Comment