27.7 C
Hyderabad
May 4, 2024 08: 36 AM
Slider నిజామాబాద్

జర్నలిస్టుల సమస్యలపై స్పందిస్తా

#journalists

జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తా అని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా)కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. సోమవారం టీజేఏ(తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్) బిచ్కుంద మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, జుక్కల్ నియోజక వర్గంలో అన్ని అర్హతలు ఉండి, ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకొని ఉండి, అక్రిడిటేషన్ రాని జర్నలిస్టులు తనను సంప్రదిస్తే అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ తో పాటు  అక్రిడిటేషన్ కమిటీ సభ్యులను సంప్రదించి సమస్యని వివరించి అక్రిడిటేషన్ వచ్చేలా చేస్తాం అన్నారు. 

జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అన్నారు. జర్నలిస్ట్ లపై దాడులు జరిగితే ఆ ప్రాంత జర్నలిస్టులు యూనియన్ లకు అతీతంగా అందరూ కలిసి బాధిత జర్నలిస్టుకు అండగా నిలబడాలని అన్నారు. జర్నలిస్టులో ఐఖ్యమత్యం చాలా ముఖ్యం అన్నారు. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన  బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు తనవంతు సహకారం ఉంటుందన్నారు.

ఒక మండలంలోని పాత్రికేయులు సంఘటితంగా ఉంటే, వారి జోలికి వచ్చి ఎవరైనా దాడులు చేయాలంటే కూడా భయపడతారని అన్నారు. ఎవరికైనా ఐక్యమత్యమే బలం అన్నారు. బిచ్కుందలో జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు వచ్చేలా, ఎమ్యెల్యే హన్మంత్ షిండే, ఎంపీ.బీబీ పటేల్ సహకారంతో తన వంతు ప్రయత్నం చేస్తాం అన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్ట్ లకు న్యాయం జరుగుతుందన్నారు. అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్ట్ కు హెల్త్ కార్డ్, బస్సు పాస్ సౌకర్యం కల్పించిందని, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో టీజేఏ ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షులు రవీందర్, సభ్యులు లాలయ్య, టేక్మాల్ దయానంద్, కుర్మాన్ పల్లి లక్ష్మణ్, అంజయ్య, బస్వరాజ్, నాగరాజు, రాజు,  తదితరులు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి గురుమూర్తి

Satyam NEWS

మన మధ్య చిరస్థాయిగా నిలిచే కళాతపస్వి

Bhavani

భారత పోలీస్ క్రీడాపోటీల విజేతలకు డీజీపీ అభినందన

Bhavani

Leave a Comment