38.2 C
Hyderabad
April 29, 2024 22: 07 PM
Slider నిజామాబాద్

వైన్స్ షాపుల వద్ద మద్యం ప్రియుల భారీ క్యూ

#Yellareddy Wines

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధారి,లింగంపేట్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి లో ఉన్న 6 వైన్స్ షాప్ లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో భాగంగా లిక్కర్ అమ్మకలకు పర్మిసన్ ఇవ్వడంతో వైన్స్ షాపుల వద్ద బుధవారం ప్రొద్దున సమయం నుండి ప్రజలు క్యూ కట్టారు. పోలీసులు వారిని డిస్టెన్స్ పాటించడం తప్పని సరి అని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అన్నారు.

మందు కొనేవారి వద్ద వైన్స్ యజమానులు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన ధరలకు కాకుండా 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు మందు విక్రయించేవారు ఆవేదన వ్యక్తంచేశారు. 40 రోజుల నుండి లిక్కర్ లేక ఇబ్బందులకు గురి కాగా ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన ధరలకే మద్యం విక్రయాలు జరపకుండా అధిక ధరలకు విక్రయిస్తుంట్లు తెలుస్తుంది.

ఒక్కసారిగా  వైన్స్ లు తెరిచేసారికి ప్రజలు బారులు తీరి కనబడడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదేమైనప్పటికి ప్రజలు సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ శశాంక్ రెడ్డి, సీఐ రాజ్ శేఖర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ స్వామి, ఎస్ ఐ శ్వేతా, ఆబ్కారీ సిఐ శ్రీనివాస్, ఆప్కారి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరు దూరం పాటించాలని సూచనలు ఇచ్చారు.

Related posts

కాజ్ ఆఫ్ డెత్ :నాతల్లి మరణానికి జాతీయ రహదారుల సంస్థే కారణమం

Satyam NEWS

మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకొన్న ఓ ఆటోడ్రైవర్

Satyam NEWS

స్నేహలత హత్యపై కడప టీడీపీ నిరసన

Satyam NEWS

Leave a Comment