41.2 C
Hyderabad
May 4, 2024 17: 04 PM
Slider నెల్లూరు

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం

#narayana

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడును వెంట‌నే విడుద‌ల చేయాలంటూ… టీడీపీ నేత‌లు జిల్లాలో రిలే నిరాహార‌దీక్షలు, సంత‌కాల సేక‌ర‌ణ‌, ప్రార్ధ‌న‌లు, పూజ‌లు, మ‌హిళ‌ల ఆశా జ్యోతి వంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై మాజీ మంత్రి, న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి పొంగూరు నారాయ‌ణ‌, నెల్లూరులోని నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజీ క్యాంప్ కార్యాల‌యంలో డివిజ‌న్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబుకు తామంద‌రం అండ‌గా నిల‌వాల‌ని, ఆయ‌న్ని విడుద‌ల చేసేంత వ‌ర‌కు క‌లిసి క‌ట్టుగా పోరాడాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Related posts

పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Satyam NEWS

A proofreading service is really a dependable source for catching spelling, punctuation and grammar and capitalization errors

Bhavani

ములుగులో చురుకుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Satyam NEWS

Leave a Comment