21.7 C
Hyderabad
December 2, 2023 04: 22 AM
Slider మహబూబ్ నగర్

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వనపర్తి జిల్లా ఎస్పీ

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వనపర్తి జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించారు. వనపర్తి జిల్లా పోలీసు ముఖ్య అధికారి రక్షిత కె మూర్తి ముఖ్య కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్,సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రాలకు పూల మాలలు అలంకరించి సాయుధ బలగాల గౌరవ వందనాల మధ్య జాతీయ పతాకాన్ని జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17 వ తారీఖున భారతదేశ యూనియన్ నందు విలీనమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రజలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ గురించి, రాష్ట్ర అవతరణకు ఎందరో మంది మహానుభావుల ప్రాణ త్యాగాల, జాతీయ సమైక్యతా దినోత్సవం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి తాజుద్దీన్, డిస్పీ శ్రీ అనంద రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, అప్పలనాయుడు, ఎస్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్, డిసిఆర్బి, ఎన్ఐబి, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్స్, యస్ఐ లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రధ సప్తమి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు

Satyam NEWS

ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

Satyam NEWS

రామన్నకు యాంకర్ అనసూయ క్షమాపణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!