29.7 C
Hyderabad
May 7, 2024 04: 59 AM
Slider కవి ప్రపంచం

గాన అమర్ రహే

#Redium New

పాటను మరచిపోలేరు

ఆటల ధూంధాం ను

మరచి పోలేరు

విగత శరీరాన్నిమాత్రం

ఖననం చేయగలరు…

పాట పగడాల్లా జారువారి

ఎరపు వర్ణమై ప్రకాశిస్తుంది

ఆట జనపదాల పాదాలను

కదన కథనం చేస్తుంది

డప్పుల దరువు

ప్రళయ మేఘగర్జనలై

అవినీతి పరుల గుండెలు

జారినట్లు చేస్తుంది…

ఆ పాట

ఆ ఆట

ఆ డప్పు

మూగ పోయింది

జన జాగృతి లో

జాగోరే జాగోరే అంటూ

బతికే ఉంటుంది…

పాటకొక చరిత్ర

ఆటకొక చరిత్ర

ఊపిరిలూది

సజీవం చేసిన గద్దర్

చరిత్రలో ఓ పుట

రేడియమ్, 9291527757

Related posts

కాంట్రవర్సీ: మూడు రాజధానులకు ఇక అడ్డే లేదు

Satyam NEWS

ముస్తాబవుతున్న ఆదర్శ రైల్వే స్టేషన్లు

Bhavani

రెడ్ జోన్ ఎత్తేసినా జాగ్రత్తలు తప్పని సరి

Satyam NEWS

Leave a Comment