29.7 C
Hyderabad
May 4, 2024 05: 31 AM
Slider ముఖ్యంశాలు

మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం

#Mission Kakatiya

తెలంగాణలోని వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, సామాజిక స్థితిగతులను బట్టి కొన్ని శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు స్థానిక పరిస్థితులను గుర్తించి ఆనాడే గొలుసు కట్టు చెరువుల నిర్మాణం ద్వారా గ్రామాలను

స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే కాక సమగ్ర అభివృద్ధికి ఒక కేంద్రంగా గ్రామాలను తయారు చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా రిజర్వాయర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన చెరువుల పండుగలో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ పాల్గొన్నారు.చెరువు కట్ట వద్ద కట్టమైసమ్మలకు పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లికి పూజలు చేసి

ప్రజలతో పాటు కలిసి తనకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలను చెరువుల్లో వదిలారు. రాజుల కాలంలో తెలంగాణలో చెరువులను నిర్మించి కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా సాగునీటి, తాగునీటి సమస్యలను

శాశ్వతంగా పరిష్కరించారని, అయితే వాటిని ఉమ్మడి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేశారని ఆయన ద్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆనాటి చెరువులను తిరిగి

పునరుద్ధరించడం ద్వారా పూర్వవైభవం తెచ్చారని మంత్రి పేర్కొన్నారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన చెరువులన్నింటిని సీఎం కెసిఆర్ మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించి పూర్వవైభవం తెచ్చారని చెప్పారు. ఐదువేల కోట్లు ఖర్చు చేసి

రాష్ట్రంలోని 46వేల చెరువులను బాగు చేశారని దీనివల్ల భూగర్భ జలాలు పెరిగాయని మంత్రి తెలిపారు. అదే రీతిలో చెరువుల కింద 150 శాతం పంటల సాగుబడి పెరిగిందని అలాగే దిగుబడి కూడా పెరిగిందని మంత్రి వివరించారు.

రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తూ అన్ని రకాల వ్యవసాయ రంగ అవసరాలు తీరుస్తూ, 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తూ, చివరకు పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రైతాంగాన్ని పూర్తిగా

ఆదుకొని రైతులు రాజుగా చూసే ప్రజల్ని సౌభాగ్యంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో సీఎం దిగ్విజయం సాధించారని మంత్రి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వేయడంతో లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని,

నేడు ప్రజలకు ఆరోగ్యకరమైన చేపల దొరుకుతున్నయని అన్నారు. తెలంగాణలో ప్రజలకు చెరువులే ఆదెరువు అని, ఈ విషయాన్ని గుర్తించి, మన స్థానిక అవసరాలకు తగ్గట్టుగా అనేక పథకాలు రూపొందించి, సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి

కోసం సీఎం కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారు, ఆయనకు అండగా ఉందాంమని, ఆయన మనకు అండదండగా ఉంటారని మంత్రి పువ్వాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.70 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే, ఇవ్వాళ ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని, కెసిఆర్ ఇంతగా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు.

Related posts

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

Satyam NEWS

చాలా చోట్ల రేగిన అసమ్మతి: బాలినేనికి పెరిగిన బిపి

Satyam NEWS

వ్యతిరేకత కొనితెచ్చుకుంటున్న ఏపి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment