29.7 C
Hyderabad
May 1, 2024 06: 57 AM
Slider ఖమ్మం

రైతులను దగా చేసే మద్ధతు ధరలు

#CPI

నరేంద్ర మోడీ`బిజెపి ప్రభుత్వం వ్యవసాయ పంటలకు ప్రకటించిన మద్ధతు ధరలు రైతులను మరొకసారి దగా చేయటమేనని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని

నమ్మించిన ప్రధాని మోడీ రైతుల అప్పులను రెట్టింపు చేశాడన్నారు. కనీసం పెట్టుబడి కూడా రాకుండా యిచ్చే మద్ధతు ధరలు గురించి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. జాతీయ సగటు పేరుతో దక్షిణాది రాష్ట్రాల రైతుల కష్టాన్ని

కేంద్రం దోచుకుంటుందని మండిపడ్డారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయత లేదన్నారు. క్వింటా వరి ధాన్యం ఉత్పత్తి ఖర్చు 3300 రూ.లు అయితే 1200 రూ.లు తగ్గించి 2183, పత్తికి క్వింటాకు 12 వేలు ఉత్పత్తి ఖర్చు అయితే 4 వేలు తగ్గించి 7020

రూ.లు నిర్ణయించటం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే చర్యలు తప్ప మరొకటి కాదన్నారు. మిగతా పంటల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ దిక్కుమాలిన కంటితుడుపు మద్ధతు ధరలు గాలికి ప్రకటించటమే తప్ప కనీసం

వీటినైనా అమలుపరిచే చట్టమే లేదన్నారు. రైతు ఉద్యమాలకు తలొంచి మద్ధతు ధరల చట్టం తెస్తామని చెప్పి 2 సం.లు అయినా దాని ఊసే లేదన్నారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కార్పొరేట్ల కోసమే ఇంతగా పనిచేసే

ప్రభుత్వం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. వరికి 5 వేలు, పత్తికి 16 వేలు అదేస్థాయిలో మిగతా పంటలకు గిట్టుబాటు ధరలు యిచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశార

Related posts

ఆఖరు నిమిషం వరకూ రఘురామను ఎందుకు ఆపారు?

Satyam NEWS

రేవంతన్న పదవీ స్వీకారోత్సవానికి వేలాదిగా తరలిరండి

Satyam NEWS

వనపర్తిలో స్కానింగ్ సెంటర్ లను తనిఖీ చేసిన వైద్య శాఖ

Satyam NEWS

Leave a Comment