37.7 C
Hyderabad
May 4, 2024 14: 20 PM
Slider నల్గొండ

బేషరతుగా వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే

#CPIHujurnagar

రైతు ప్రజా వ్యతిరేక నిరంకుశ ప్రభుత్వాలు నశించాలని  సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు  పాలకూరి బాబు,యల్లావుల రాములు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఢిల్లీ నగరంలోని రైతు ఉద్యమానికి మద్దతుగా పట్టణంలో భారీగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలకూరి బాబు, యల్లావుల రాములు తదితర వక్తలు మాట్లాడుతూ  బేషరతుగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ చట్టాల వలన దేశంలో భవిష్యత్తులో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. ఆహార భద్రత,నిత్యావసరాల చట్టం, మద్దతు ధర,లాంటి అంశాలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాకుండా చేయడమే ఈ చట్టాల లక్ష్యమని అన్నారు.

ప్రజలను అందరినీ ఇబ్బంది పాలు చేసేలా, కార్పొరేట్ వ్యవస్థకు జాతీయ సంపదను దోచిపెట్టేలా ఈ చట్టాలు రూపొందించారని అన్నారు.

ఈ నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు CPI పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ర్ట కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పుజు సూర్యనారాయణ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్,

జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రమేష్ ,సిపిఐ నాయకులు ఇందిరాల వెంకటేశ్వర్లు,జక్కుల రమేష్ , జక్కుల శ్రీనివాస్, గుండెబోయిన వెంకన్న,అబ్బురబొయిన లింగయ్య,దేవరం సుజాత, యల్లావుల ఉమా, టీవీ, పొనుగుపాటి వాసుదేవరావు , దేవరం రవీందర్ రెడ్డి , పశ్య వెంకటరెడ్డి ,చెన్న గానీ సైదులు , నరాల భాస్కర్,సోమగాని క్రిష్ణా, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Related posts

తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా మొగుళ్ల భద్రయ్య

Satyam NEWS

బాగ్ అంబ‌ర్ పేట్‌లో నూత‌న మ్యాన్ హోల్స్ నిర్మాణం

Sub Editor

అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ ఫ‌స్ట్ లుక్

Satyam NEWS

Leave a Comment