33.2 C
Hyderabad
May 4, 2024 00: 28 AM
Slider జాతీయం

ఆయుర్వేద వైద్యానికి మళ్లీ మంచి రోజులు

#goa

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గోవాలో 3 జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రారంభించారు. ఇందులో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) కూడా ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద దేశంలోనే ఆయుర్వేద వైద్య విద్యలో ప్రీమియర్ ఇన్ స్టిట్యూట్. ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

దీంతో పాటు ఘజియాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్, ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. గోవాలో జరిగిన 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (WAC) ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఈరోజు ఆయుర్వేదానికి సంబంధించిన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజని అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మారుతూ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తీసుకొచ్చారని, 70 ఏళ్లలో చేయనిది ప్రధాని 8 ఏళ్లలో చేశారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు గోవాలో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖ లేదు, కానీ నేడు ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ తర్వాత, గోవాలో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉంటుంది. దీనిని రాష్ట్రంలోని ఆయుష్ వైద్యులకు అంకితం చేశారు.

Related posts

రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం

Satyam NEWS

విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదు

Satyam NEWS

ట్రోఫీ ని అందజేసిన మంత్రి పువ్వాడ

Murali Krishna

Leave a Comment