38.2 C
Hyderabad
May 5, 2024 20: 08 PM
Slider వరంగల్

విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదు

#gousealam

ములుగు జిల్లా పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని ములుగు సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గౌష్ ఆలం తెలియచేసారు. ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్న వేళ ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ములుగు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ  ర్యాలీలు, వేడుకలను నిర్వహించుకోరాదు. అలానే బాణా సంచా కాల్చడం, డిజే వినియోగం, ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇతర ర్యాలీలతో పాటు, సంస్కృతికి కార్యక్రమాల నిర్వహణ, గుంపులు తిరగడం నిషేధించడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకారాన్ని అందించాలిసిందిగా  ఎస్ పి సూచించారు. ఎవరైనా పోలీసు నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని ఎస్ పి హెచ్చరించారు.

Related posts

10 శాతం ఓట్లు పోయినా…. బిజెపికి ఢోకా లేదు….

Satyam NEWS

మానవత్వానికి అర్ధం చెప్పిన మహిళా ఎస్ ఐ శిరీష

Satyam NEWS

రోడ్డు విస్తరణ పనులకు స్టాండింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

Leave a Comment