40.2 C
Hyderabad
May 5, 2024 15: 11 PM
Slider ప్రపంచం

AIIMS సైబర్ ఎటాక్: చైనా హ్యాకర్లు చేసిన పనే

#AIMSdelhi

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో డేటా చోరీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనాకు సంబంధించిన హాకర్లు ఎయిమ్స్ కంప్యూటర్లను హ్యాక్ చేశారనే విషయం వెల్లడి అయింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఇప్పుడు ఇంటర్‌పోల్ సహాయంతో చైనా నుండి డేటాను కోరింది. ఢిల్లీ పోలీసుల అభ్యర్థనపై సీబీఐ ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ నుంచి హ్యాకర్లు ఎయిమ్స్ డేటా చోరీకి పాల్పడ్డారు. చైనా లో ఇంటర్నెట్ అందించే కంపెనీ నుండి సంబంధిత డేటాను పోలీసులు కోరారు.

హ్యాకర్లు రెండు మెయిల్స్ వాడారు. వారి ఐపి ఐడిలు చూసిన ఢిల్లీ పోలీసులు ఈ ఐపీ అడ్రస్ తీసుకున్నవారు ఈ మెయిల్స్‌ను ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారో, అవి ఏ వ్యక్తికి లేదా కంపెనీకి చెందినవో చెప్పాలని కోరారు. హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న హ్యాకర్లు ఈ డేటా చోరీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఒక మెయిల్ dogA2398@protom mail.com మరియు దీని IP చిరునామా 146.196.54.222 హాంకాంగ్ నుండి. రెండవ మెయిల్ mouse63209@protom mail.com దీని IP చిరునామా 103.78.121. 131 చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందినది.

ఈ మెయిల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉపయోగిస్తున్నారు. సైబర్ దాడి తర్వాత, బ్యాకప్ నుండి AIIMS డేటాను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ సెల్ సీనియర్ అధికారి తెలిపారు. అయినప్పటికీ, సైబర్ దాడి కారణంగా కొంత డేటా పోయింది. పూర్తి డేటా రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం AIIMS సైబర్ దాడికి సంబంధించిన చిత్రాలను తొమ్మిది ఎన్వలప్‌లలో గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి పరీక్ష కోసం పంపింది. ఢిల్లీ పోలీసు అధికారులు లేఖలు రాయడమే కాకుండా పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు ముంబైలోని డేటా సెంటర్‌కు కూడా వెళ్లారు. అయితే అక్కడ కూడా పోలీసులకు ఆశించిన సమాచారం రాలేదు.

Related posts

షట్ డౌన్: ఇంటర్ నెట్ డిస్కనెక్ట్ వల్ల 9 వేల కోట్లు కట్

Satyam NEWS

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS

Leave a Comment