30.2 C
Hyderabad
February 9, 2025 21: 06 PM
Slider జాతీయం

వాయుకాలుష్యంపై ఐదు రాష్ట్రాలకు రెడ్ ఎలర్ట్

air polution

వాయుకాలుష్యం దారుణమైన స్థాయిలకు పెరగడంతో ఐదు ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లలో వాయు కాలుష్యం భారీ స్థాయిలో పెరిగింది. వాయు కాలుష్య సూచిక ఢిల్లీలో 448 కాగా, ఘజియాబాద్‌లో 439, ఫరీదాబాద్‌లో 465, గ్రేటర్ నోయిడాలో 448, నోయిడాలో 471, గురుగ్రామ్‌లో 344 కు చేరింది.

తీవ్రమైన శీతాకాలం తో బాటు గాలిలో విషపూరిత వాయువులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజన్ సరిగా లేకపోవడంతో చాలా రోజుల నుంచి ఉదయం పూట విమానాలు ల్యాండింగ్ జరగడం లేదు. దాదాపు 530 విమానాలు ల్యాండింగ్ కు ఆలస్యం కాగా మరో 20 విమానాలు మార్గం మళ్లించారు. ఢిల్లీకి వచ్చే 30 రైళ్లు ఆలస్యంగా తమ గమ్యస్థానానికి చేరుకోగా, చాలా వాటిని మళ్లించారు. 

అదే సమయంలో 34 రైళ్లు రోజూ ఆలస్యంగా నడుస్తున్నాయి. 119 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 1901 సంవత్సరం తరువాత దేశ రాజధానిలోని సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలుగా నమోదు అయింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి.

Related posts

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ప్రారంభం .

mamatha

డేంజర్:అమెరికా డాక్‌యార్డులో ఫైర్ 8 మంది మృతి

Satyam NEWS

గుడ్ న్యూస్:కరోనా చికిత్స బిల్లు సింగపూర్ ప్రభుత్వానిదే

Satyam NEWS

Leave a Comment