40.2 C
Hyderabad
May 5, 2024 17: 01 PM
Slider ప్రత్యేకం

ప్రధాని మోడీని గద్దె దించేందుకు… ఇప్పటి నుంచే కసరత్తు..!

#AITUC

ఏఐటీయూసీ రాష్ట్ర 17 వ మహాసభలను జయప్రదం చేయండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు చేస్తున్నాయని ఏపీలో ని విజయనగరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్చి 6,7,8 తేదీల్లో గుంటూరులో జరిగే ఏఐటీయూసీ 17 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను కార్మికులతో కలిసి విడుదల చేసారు.

ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ భారతదేశంలో లక్షలాది మంది కార్మికులు నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్, పెట్టుబడిదార్లకి అనుకూలంగా 4 లేబర్ కోడ్ లుగా కార్మిక వ్యతిరేక చట్టాలను మార్పు చేసి తీసుకురావడం కార్మికుల వెన్నువిరచడమే అవుతుందని మండిపడ్డారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలు ఆదాని, అంబానీల్లాంటి కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తూ మోడీ కార్పొరేట్ సేవల్లో తరించిపోతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించడానికి ఏఐటీయూసీ పిలుస్తున్నదన్నారు. మార్చి 6,7,8 తేదీల్లో జరగబోయే రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తులో ఏఐటీయూసీ నేతృత్వంలో చేయబోయే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వరంగాన్ని కాపాడటం కోసం, కార్మిక కోడ్స్ రద్దుకై పోరు సాగిద్దామన్నారు.. అసంఘటితరంగ కార్మికులకు, ఆటో, హమాలీ, వీధి విక్రయదారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీం కార్మికులకి ఉద్యోగ భద్రతకై, కనీస వేతనం 24 వేల కొరకు, కాంట్రాక్టు వ్యవస్థ రద్దుకై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు, పి.ఆర్.సి. సాధన కోసం, సి.పి.ఎస్. రద్దు, పాత పెన్షన్ అమలుచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పటిష్టత కోసం, 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లో పనిచేయువారికి మెరుగైన వేతనాల కోసం సంఘటిత ఉద్యమాన్ని నిర్మిద్దామన్నారు.

దేశ రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ధ్వంసం చేస్తూ, విజృంభిస్తున్న మతోన్మాద, ఫాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు కార్మిక వర్గాన్ని సమాయత్తం చేసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికె మిషన్ 2024 నినాదంతో మార్చి 28, 29 తేదీలలో ఏఐటీయూసీ తో పాటు దేశంలో 11 కేంద్ర కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం కోసం కార్మికు సోదరులంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులందరు పాల్గొన్నారు.

Related posts

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలి?

Satyam NEWS

400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిన భారత్‌

Satyam NEWS

తీసుకున్న అప్పు ఇవ్వమంటే హత్య చేశారు

Murali Krishna

Leave a Comment