38.2 C
Hyderabad
May 3, 2024 21: 11 PM
Slider ముఖ్యంశాలు

1200 మంది సిబ్బందితో సీఎం ప‌ర్య‌ట‌న‌కు బందోబ‌స్తు…!

#VijayanagaramPolice

ఏపీ సీఎం జ‌గ‌న్.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రెండోసారి పర్యటించనున్నారు. సీఎం కార్యాల‌యం నుంచీ మినిట్ టూ మినిట్ ప్రోగ్రామ్ కూడా జిల్లా అధికారుల‌కు అందింది. దీంతో  సుమారు రెండున్న‌ర గంట‌ల సీఎం ప్రొగ్రామ్ ఖ‌రారు కావవ‌డంతో అటు రెవిన్యూ,ఇటు పోలీసులు త‌గిన ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మయ్యారు.

అయితే జిల్లా పోలీస్ శాఖ 1200మంది  సిబ్బందితో గట్టి బందోబ‌స్తు నిర్వ‌హిస్తోంది. ప్ర‌త్యేకించి…60 స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది…గుంక‌లాం ప్రాంతాన్ని జ‌ల్లెడ ప‌డుతున్నారు. 48 గంట‌ల ‌ముంద‌గానే నాలుగు పార్టీల‌తో మొత్తం 300 ఎక‌రాల స్థ‌లాన్ని విస్త్ర‌తంగా సోదాలు జ‌రుపుతున్నారు.

మొత్తం 1207 మంది సిబ్బందిలో ఇద్ద‌రు ఏఏస్పీలు, 9 మంది డీఎస్పీలు,28 సీఐలు,84 మంది ఎస్ఐ,ఆర్ఎస్ఐలు,249 ఏఏస్ఐ,హెచ్సీలు,466 మంది కానిస్టేబుళ్లు, 184 మంది హోం గార్డులు,124మంది మ‌హిళా హోం గార్డులు,కానిస్టేబుళ్లు, 61 మంది ఆర్మ‌డ్ సిబ్బందితో గట్టి బందోబ‌స్తు ఏర్పాట్లు చేసింది..జిల్లా పోలీస్ శాఖ‌.

ఇప్ప‌టికే డీఐజీ…రెండు సార్లు గుంకాలంను సంద‌ర్భించి..సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను అందుకు త‌గ్గ సూచ‌న‌ల‌ను అడిష‌న‌ల్ ఎస్పీల‌కు ఇచ్చారు.ఇక  4 పార్టీల‌తో స్పెష‌ల్ పార్టీ సిబ్బంది…గుంక‌లాం ప్రాంతంలో కూంబింగ్ నిర్వ‌హించారు.

సీఎం పర్య‌ట‌న‌కు సంబంధించి రెండు రోజులు ముందుగానే అమ‌రావ‌తి నుంచీ ఇంట‌లిజెన్స్ అధికారులు వ‌చ్చి..ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముందుగా స‌మాచారం సేక‌రించ‌డం ప్రారంభించారు.

ఈ మేర‌కు డీఎస్పీ సౌమ్య‌ల‌త‌…జిల్లా ఇంటలిజెన్స్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.మ‌రో వైపు స్పెష‌ల్ బ్రాంచ్ పోలీసులు కూడా సీఐ ర్యాంక్ అధికారులు…సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి..బందోబ‌స్తు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు.

ఇక సీఎం కాన్వాయ‌కి సంబందించి ఏఆర్ డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నుంది. సీఎం కాన్వాయిల్ లో మొత్తం 12 వాహ‌నాలు ఉండ‌గా..అందుకు 20 వాహ‌నాల‌తో కాన్వాయ‌న్ ను సిద్దం చేస్తోంది..పోలీస్ శాఖ‌. సీఎం పర్య‌ట‌న‌ను డీఐజీ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుంటున్నార‌నే చెప్పాలి.

Related posts

పిల్లలకు టీకా రేపటి నుంచే: వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

(Free|Trial) Fruit And Plant Weight Loss Pills Side Effects

Bhavani

ఈ రెండు తెలుగు రాష్టాలకు ఏమైంది?

Satyam NEWS

Leave a Comment