33.2 C
Hyderabad
May 3, 2024 23: 15 PM
Slider మహబూబ్ నగర్

నాయకులు ఆక్రమించకుండా కొల్లాపూర్ పీజీ కాలేజ్ స్థలం కాపాడండి

#JupallyKrishnarao

కొల్లాపూర్  పీజీ కాలేజీ స్థలం కొందరి నాయకుల, రియల్ వ్యాపారుల నుండి  అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని  కాలేజీ ప్రిన్సిపాల్ కు మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు మెమరండం అందజేశారు.

కొల్లాపూర్ పట్టణ సమీపంలోని పీజీ కాలేజ్ తూర్పు భాగాన  ఈనెల23న సర్వే నంబర్ 92లో రెవెన్యూ అధికారులు  సర్వే చేయించారు.సర్వే నెంబర్ 91లో వెంచర్ వేసుకున్న రియల్ వ్యాపారులు 92 సర్వే నంబర్లో  ప్లాట్లనువేసుకున్నట్లు అధికారులు గుర్తించారని మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు తెలియచేశారు.

అయితే కొందరు నాయకులు వ్యాపారులకు అండగా ఉండి పీజీ కాలేజీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రిన్సిపాల్ కు నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.

అలాంటి బెదిరింపులకు భయపడకూడదని  అండగా ఉంటామని జూపల్లి  వర్గీయులు భరోసా ఇచ్చారు.గతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్యాక్రాంతమైన సర్వే నెంబర్ 92 లోనీ  నాలుగు ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమినీ పీజీ కాలేజీ కి ఇప్పించినట్లు జూపల్లి వర్గీయులు గుర్తు చేశారు.

వెంటనే  స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని ప్రిన్సిపాల్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పదోవ వార్డు కౌన్సిలర్ రహీం పాషా,మాజీ సర్పంచ్ మేకల నాగరాజు,పసుపుల నరసింహ, ఎక్బాల్,

మేకల కిషోర్ యాదవ్,మేకల కిరణ్ యాదవ్,పసుల వెంకటేష్,రమేష్ ముదిరాజ్, కర్నే శివ,రెడ్డి సత్యం, నయిం,దిలీప్ కుమార్,యం డి ముస్తాక్,పాశం రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

“బ‌జార్ రౌడి” తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

Satyam NEWS

ఉత్సాహంగా ములుగు జిల్లా స్థాయి ఆటల పోటీలు

Bhavani

స్వచ్ఛ భారత్: మరుగుదొడ్ల నిర్మాణాలపై సర్వే

Satyam NEWS

Leave a Comment