40.2 C
Hyderabad
May 5, 2024 15: 23 PM
Slider ఆదిలాబాద్

అభివృద్ధికి అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలి

nirmal col 06

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు జిల్లాలో త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖలతో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో  ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒక శాఖలోని అభివృద్ధి పనులు వేరొక శాఖ వల్ల ఆలస్యం కాకుండా ఉండేందుకే కన్వర్జెన్స్ మీటింగు ఏర్పాటు చేశారు.

జిల్లాలోని అన్ని శాఖలతో మూడు నెలలకు ఒకసారి కన్వర్జెన్స్  సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రతి శాఖ తమకు కావాల్సిన రిక్వైర్మెంట్ ను లేవనెత్తి పరిష్కారం చేసుకోవాలన్నారు. జిల్లాలోని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు  వేసవి సెలవుల్లో వారి పిల్లలు అక్షరాస్యులుగా తీర్చిదిద్దేల ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

 కరోనా వైరస్ వ్యాధి కేసులు  ఎవరికి కూడా సోక లేదన్నారు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపించదని, లాలాజలం, నాసికా ద్రవాలు, ఇది ద్వారా వ్యాపిస్తుందని అన్నారు. వ్యాధి వచ్చిన వారు మాత్రమే మాస్క్ వేసుకోవాలి అన్నారు. జిల్లా అటవీ అధికారి ఎస్.పి. సుధన్ మాట్లాడుతూ జిల్లాలో ఎకో టూరిజం, సఫారీ పార్క్, కోతుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.

కోతుల పునరావాస కేంద్రంలో కోతులకు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ నిమిత్తం జిల్లా నుండి ముగ్గురు వెటర్నరీ వైద్యులను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పంపామన్నారు. అడవి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాంపూర్,   మైసంపేట గ్రామాల పునర్నిర్మాణము చర్యలు తెలిపారు.

జిల్లాలో అదే సమస్య ఏమైనా ఉంటే ఆయా శాఖల తో చర్చించి  పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్ హెచ్ 44, ఎన్ హెచ్ 61, ఆర్ అండ్ బి, రోడ్లపై ప్రమాదాలు జరగకుండా తరచుగా ప్రమాదాలు జరిగే రోడ్లను ఏ, బి,సి క్యాటగిరి  గుర్తించి భద్రత చర్యలు  తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, నర్సింగరావు, ఆర్ డి ఓ లు రాజు, ప్రసూనాంబ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ-రాయపూర్ ఎన్.హెచ్ కు భూసేకరణపై చర్చ.!

Satyam NEWS

శంభో శివ శంభో: వేడుకగా అత్తిరాల తిరునాళ్ళు

Satyam NEWS

ఘనంగా ములుగు పోలీసుల సురక్ష దివస్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment