40.2 C
Hyderabad
May 1, 2024 17: 13 PM
Slider వరంగల్

ఘనంగా ములుగు పోలీసుల సురక్ష దివస్ ర్యాలీ

#mulugupolice

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సురక్ష దివస్ ర్యాలీ నిర్వహించారు. సురక్ష దివాస్ ర్యాలీ  ములుగు జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా  జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హాజరు అయ్యారు. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పోలీస్ శాఖ  సాధించిన విజయాలను దృశ్య రూపం వీడియోను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం ర్యాలీ ప్రారంభం కాగా  జిల్లా కలెక్టర్ ఎస్పీ  ఇతర ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ములుగు పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు  సాగింది. ములుగు జిల్లా పోలీస్ శాఖ పోలీస్ విధులు పట్ల ప్రజల అవగాహనకై కార్యక్రమం నిర్వహించగా  ముఖ్య అతిథిగా  వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా  జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి  జెడ్పి చైర్మన్ బడే జ్యోతి డిస్టిక్ పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ అధికారి లక్ష్మీనారాయణ, జెడ్పి సీఈఓ రాణి,ఎంపీపీ శ్రీదేవి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖలోని  ఒక్కో వర్టికల్ కి ఒక స్టాల్ నిర్మించి  పోలీస్ విధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మొత్తంగా 12 స్టాల్స్ నిర్వహించగా  అందులో  ఆయుధాల ప్రదర్శన అల్లరి మూకల నుండి రక్షించుకునే రియట్ గేర్ నేర పరిశోధనలో కీలకమైన క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ ప్రాముఖ్యత అత్యవసర సేవలు అందించే డయల్ 100  రాత్రి పగలు గస్తీ కాసే బ్లూ కోల్ట్స్ షీ టీమ్స్, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్  కమ్యూనికేషన్ విభాగం మత్తు పదార్థాలు, ఫోక్సో చట్టం ప్రాముఖ్యత సైబర్ నేరాల పట్ల అవగాహన డ్రోన్ కెమెరాల ఉపయోగం పోలీస్ విభాగంలో అత్యంత కీలకమైన డాగ్ స్క్వాడ్ బాంబ్స్ స్క్వాడ్  రోడ్డు భద్రత అవగాహన వరదల సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు ఆహారం ఆవాసం అందించిన పోలీసుల వీరత్వం వంటి అంశాలపై ప్రదర్శనను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి అశోక్ కుమార్ ఏఎస్పి ఏటూర్ నాగారం సిరి శెట్టి సంకీర్త్  అదనపు ఎస్పీ  సదానందం డి సి ఆర్ బి డిఎస్పి సుభాష్ బాబు డి ఎస్ పి ములుగు రవీందర్ సి ఐ ములుగు రంజిత్ కుమార్ సి ఐ పస్రా శంకర్ సి ఐ వెంకటాపురం శివప్రసాద్ సి ఐ సి సి ఎస్ రవీందర్ ఆర్ ఐ అడ్మిన్ వెంకటనారాయణ ఆర్ ఐ ఆపరేషన్స్ కిరణ్ సి ఐ కమ్యూనికేషన్ రోహిత్, ఎస్ ఐ పస్రా కర్ణాకర్ రావు ఎస్ బి ఎస్ ఐ ఓంకార్ యాదవ్ ఎస్ ఐ తడ్వాయి వెంకటేశ్వర్లు ఎస్సై మంగపేట తాహీర్ బాబా ఎస్సై కన్నాయిగూడెం సురేష్ ఎస్సై పేరూరు హరీష్  ఎస్సై వాజేడు అశోక్ ఎస్సై మధులిక ఆర్ఎస్ఐ నిర్మల పాల్గొన్నారు.

Related posts

దొంగ ఓట్లు: మరో అధికారి సస్పెన్షన్

Satyam NEWS

కరెంటు తీగలు తగిలి 9 మంది కూలీల మృతి

Satyam NEWS

బైరి నవీన్ ను అరెస్ట్ చేయాలి: కైలాసగిరి అయ్యప్ప సేవ సమితి

Satyam NEWS

Leave a Comment