29.7 C
Hyderabad
May 4, 2024 06: 29 AM
Slider ప్రత్యేకం మహబూబ్ నగర్

కొల్లాపూర్ కోట లో తెరవెనుక ఉన్నది ఎవరు?

jupally 18

వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఒక్క సారిగా పెద్ది రియాక్షన్ ఇచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేటి బహిరంగ సభలో చెప్పబోయేది ఏమిటి? ఆయన ఏం మాట్లాడబోతున్నాడు? కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు బాగోతం బయట పెడతారా? ఆయన వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ఆడించేది ఎవరు? ఆడేది ఎవరు? అందరి చూపులూ జూపల్లి నిర్వహించబోతున్న బహిరంగ సభ పైనే ఉన్నాయి. శని ఆదివారం రెండు రోజులూ కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మణరావు బహిరంగ చర్చకు రావాలని జూపల్లి కృష్ణారావు రామాలయంలో బైఠాయించి విసిరిన సవాల్  కు లక్ష్మణరావు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

అందుకే ఆదివారం మీడియాతో జూపల్లి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా అందరి సంగతి చెప్తా, నరం మీద నాలుక ఉండదని ఎలా పడితే అలా ఆరోపణలు చేయడం చేసిన వారి సంగతి ఏంటో చూస్తానని హెచ్చరించారు. దమ్ము ధైర్యం లేని వారు తెరవెనుక ఉండి వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేయించడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలు రుజువు చేయాలి. అలా చేయలేని సన్యాసుల సంగతి తేలుస్తానని జూపల్లి హెచ్చరించారు. వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ బయటపెడతా అంటూ జూపల్లి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం సాయంత్రం జూపల్లి ఏమి మాట్లాడుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఒక నాయకుడు రాజాదిత్య లక్ష్మణరావు ను అడ్డుపెట్టుకొని వెనక ఉండి  రాజ వారితో జూపల్లి పై ఆరోపణలు చేయిస్తున్నారని స్థానికులు అనుకుంటున్నారు. రాజకీయంగా కాకుండా పరోక్షంగా జూపల్లి ని వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా చేస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 2018 కన్నా ముందు నుండే గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే జూపల్లి ఆ స్థలం ప్రభుత్వానిదేనని ఆప్రాంతన్ని అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. ఒత్తిళ్లను ఎన్నో ఎదుర్కున్నారు. 2018 ఎన్నికల తర్వాత కొన్ని నెలల్లోనే మారిన రాజకీయ పరిణామాలు ఎన్నో వున్నాయి.

ఇప్పుడు పురపాలక అధికారి బంగ్లా వెనుక స్థలంలో నిర్మాణం చేసుకోవడానికి బాధితులకు  అనుమతులు ఇచ్చారు. ఇక్కడే మొదలయింది స్టోరీ. ఎవ్వరి వత్తిడులకు లోబడి అనుమతులు ఇచ్చారో కానీ అదే అంశాన్ని జూపల్లి గత వారం క్రిందట పురపాలక కార్యాలయాన్ని తనికి చేశారు. గత కమిషనర్ ఆ స్థలం పై హై కోర్టుకు వెళ్లారు. అసంగతి తెలిసి అనుమతులు ఎలా ఇస్తావు అని ప్రశ్నించారు. అయితే ఆ అధికారి ఒక నాయకుడికి చెప్పుకున్నారని అనుకుంటున్నారు. నిర్మాణం చేసుకోండి అని నేను చెప్పాను కదా! మీరు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని అన్నారంట నాయకుడు.

అక్కడ రోడ్డు ఎంత ఉంది. భవిష్యత్ లో ఎలా ఉంటుంది అనేది ఆలోచించకుండానే ఆదేశాలు ఎలా ఇచ్చారో కానీ ఆ మరుసటి రోజు నుండి నిర్మాణ పనులు షురూ అయ్యాయి. అయితే ఆ నాయకుడికి ఆ స్థలాన్ని అభివృద్ధి చెయ్యాలనే  ఆలోచన రాలేదు.దీనికి పురపాలక సంస్థలో పాత్ర పోషించాలని సిద్ధమైన ఒక అనుచరిడి స్వార్థం ఉంది. కేవలం ఓట్ల కోసం ఆయనను కూడా తప్పుదారి పట్టించారని ప్రజలు అనుకుంటున్నారు. ఇదే సమయంలో వెనుక ఉంది నడిపించేది ఎవ్వరని స్వయంగా జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

వారి బాగోతం బయటపెడతానని చెప్పారు. ఈ సందర్భాన్ని బట్టి సోమవారం సాయంత్రం ఆ నాయకుడి పేరు ప్రస్తావిస్తారా?బండారం బయటపెడతారా?వారు ఎవరైవుంటాని ప్రజలు అనుకుంటున్నారు. కొల్లాపూర్ రాజ బంగ్లాలో చారిత్రాత్మకంగా ఉన్న గంట కాడి నుండి ఈప్రాంత ఆలయలలో జరిగిన సంఘటనల పై మాట్లాడవచ్చు. భూముల  రిజిస్ట్రేషన్లు  బయట పెట్టే అవకాశం ఉన్నది. జూపల్లి సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Related posts

పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం

Satyam NEWS

సౌకర్యాలు కల్పించకుండానే మేళా హాస్యాస్పదం….

Satyam NEWS

9 నుంచి చిరంజీవి, కొర‌టాల శివ `ఆచార్య‌`షూటింగ్‌

Satyam NEWS

Leave a Comment