38.2 C
Hyderabad
April 28, 2024 19: 32 PM
Slider సినిమా

9 నుంచి చిరంజీవి, కొర‌టాల శివ `ఆచార్య‌`షూటింగ్‌

#MegastarChiranjeevi

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. మెగాస్టార్ 152వ చిత్రాన్ని సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చ‌ర‌ణ్‌ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ,  మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

కోవిడ్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పుడు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పునః ప్రారంభించ‌డానికి చిత్ర‌యూనిట్ సిద్ధ‌మైంది. న‌వంబ‌ర్ 9నుండి `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన మేజ‌ర్ పార్ట్ పూర్త‌వుతుంది.

కొర‌టాల శివ అండ్ టీమ్ కోవిడ్ నేప‌థ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్‌గా షూటింగ్‌ను పూర్తి చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జాగ్రత్త‌లు తీసుకున్నారు. మెగాభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ అంచనాల‌కు త‌గిన‌ట్లు చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, సురేశ్ సెల్వ‌రాజ‌న్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related posts

ఆల్కహాల్ తయారీలో మత్తుపదార్ధాలు….?

Satyam NEWS

పని చేయడం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియవు

Bhavani

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Satyam NEWS

Leave a Comment