సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బాబ్డేతో ప్రమాణ స్వీకారం చేయించారు. 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2021 ఏప్రిల్ 23 న ఆయన పదవి విరమణ చేస్తారు. నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు సీజే గా సేవలు అందించిన రంజన్ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ, జస్టిస్ ఎన్ వి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారు బాబ్డే శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన బాబ్రే అంచలంచెలుగా ఎదిగి భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించారు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
previous post