34.7 C
Hyderabad
May 5, 2024 00: 10 AM
Slider జాతీయం

పెళ్లి కోసం మతం మారడం చెల్లదు

#Marriage

పెళ్లి కోసం మతం మార్చుకోవడం చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. మతం మార్చుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక కొత్తగా పెళ్లయిన జంట అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు పెళ్లి ఎప్పుడు జరిగింది? మతం ఎప్పుడు మారారు అనే అంశాలను పరిశీలించింది. పెళ్లి అయిన నెల రోజుల కిందట వధువు మతం మారినట్లు తేలడంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.

నూర్ జహా బేగం అనే యువతి నెల రోజుల కిందట మతం మారి హిందువు అయింది. ఆ తర్వాత ఒక హిందువును వివాహం చేసుకున్నది.

దీనిపై తమకు రక్షణ కావాలని నూర్ జహా బేగం కోరింది. అయితే కేవలం పెళ్లి కోసమే మతం మారినట్లు స్పష్టం అవుతున్నందున, అలా చేయడం గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం నిషేధం కాబట్టి తాము ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెబుతూ న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.

మతంపై విశ్వాసంతో పూర్తి అవగాహనతో మానసిక ఆరోగ్యం పూర్తిగా ఉన్న మేజర్లు మతం మారవచ్చునని అలా కాకుండా ఏదో లాభం ఆశించో లేక ఏదో ఒక విషయాన్ని అడ్డుకోవడానికో మతం మారడానికి తాము అనుమతి ఇవ్వలేమని 2014లో సుప్రీంకోర్టు చెప్పింది.

Related posts

ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలి

Satyam NEWS

ఎట్టకేలకు చంద్రబాబు పర్యటనకు అనుమతి

Satyam NEWS

మాజీ హోం మంత్రి నాయిని ఇంట్లో మరో విషాదం

Satyam NEWS

Leave a Comment