అల్లరి నరేష్ హీరోగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందుతోన్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.
అల్లరి నరేష్ సరసన నాయికగా పూజా ఝవేరి నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. 2021 జనవరిలో ‘బంగారు బుల్లోడు’ను విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది.
దీనికి సంబంధించి మంగళవారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఓ మాస్ సాంగ్‌లో డాన్స్ చేస్తున్నట్లు ఆ పోస్టర్లో కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చిన ఆడియో త్వరలో విడుదల కానున్నది. చిత్రంలోని పాటలన్నింటినీ రామజోగయ్య శాస్త్రి రచించారు.
అల్లరి నరేష్ కెరీర్లో ఓ చక్కని హాస్యభరిత చిత్రంగా ‘బంగారు బుల్లోడు’ పేరు తెచ్చుకుంటుందని నిర్మాతలు తెలిపారు. టాలీవుడ్‌లోని పలువురు పేరుపొందిన హాస్యనటులు ఈ చిత్రంలో నటించారనీ, వారిపై చిత్రీకరించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయనీ చెప్పారు.
సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్‌గా పనిచేస్తోన్న ఈ చిత్రానికి కృష్ణకిశోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం:
అల్లరి నరేష్, పూజా ఝవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రామపత్ర నిత్ర వెలిగొండ శ్రీనివాస్.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గిరి పాలిక, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకిశోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర, మ్యూజిక్: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఎడిటింగ్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: ఎన్. గాంధీ, ఫైట్స్: రియల్ సతీష్, కో-డైరెక్టర్: ప్రసాద్ దాసం, పీఆర్వో: వంశీ-శేఖర్