42.2 C
Hyderabad
April 26, 2024 15: 09 PM
Slider విజయనగరం

విద్యల నగరాన్నిదొంగలు లక్ష్యంగా చేసుకున్నారా..!

Thiefs

ఏపీలోని ఉత్తరాంధ్రలో విద్యలనగరంగా పేరొందిన విజయనగరం జిల్లాను దొంగలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా కాలం కాస్త ముగిసి… సర్వత్రా అన్నివర్గాల వారు తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. పనిలో పనిగా దొంగలు కూడా తమతమ చోరీ కళను ప్రదర్శిస్తున్నారు. అదీ విద్యల నగరంగా ఖ్యాతి పొందిన విజయనగరం జిల్లా టార్గెట్ గా చేసుకున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం బాబామెట్ట దేవాలయంలో చోరీ, ఆ తర్వాత దాసన్నపేటలో రాబరీ, అలాగే కొద్ది రోజుల క్రితమే సీబీ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం… తాజాగా బొబ్బిలిలోని పది తులాల బంగారం దొంగతనం జరిగి పోలీసులు సవాలు విసురుతున్నారు. అయితే జిల్లాలోని బొబ్బిలిలో జరిగిన అయిదు తులాల కేసులో మాత్రం సీసీఎస్ పోలీసులు కాస్త పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అక్కడ లభ్యమైన సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించినట్టు సమాచారం. వాళ్లంతా యాభై ఏళ్లు పైబడి దాటినట్టు సమాచారం. అంతవయస్సులో ఉన్నవాళ్లు… ఆ దొంగతనానికి ఎందుకు పాల్పడినట్టో స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే సీసీఎస్ పోలీసులకు అర్ధంకాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఏదైనా వరుసగా జిల్లా దొంగ తనాలు జరగడంతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Related posts

జర్నలిస్టులలో బలమైన శక్తిగా మారిన ఐజేయూ

Satyam NEWS

అయిదు ల‌క్ష‌లు..కాదు…25 లక్ష‌లు న‌ష్ట‌ప‌రిహరం ఇవ్వాలి

Satyam NEWS

వనపర్తిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment