35.2 C
Hyderabad
April 30, 2024 23: 24 PM
Slider తూర్పుగోదావరి

40 లక్షల విలువైన 236 సెల్ ఫోన్లు అప్పగింత

#kakinada

వివిధ కారణాలతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ఫోన్లకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుని వాటిలో కొన్నింటిని మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి సెల్ ఫోన్ యజమానులకు అప్పగించామని, అలాగే సెల్ ఫోన్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను మొబైల్ ట్రాక్ ద్వారా వివరాలు సేకరించి వాటిని రికవర్ చేశారు. ఇలా రికవర్ చేసిన సెల్ ఫోన్ లను తిరిగి ఆ ఫోన్ యజమానులకు ఇచ్చే కార్యక్రమాన్నికాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే 94906 17852కి ఫోన్ ద్వారా లేదా (http://www.ceir.gov.in)లో తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ఈ మొబైల్ టాక్ సిస్టమును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించామని ఇందులో మొదటి విడతగా 90, రెండో విడత 249, మూడో విడత 231, నాలుగో విడత 275, ప్రస్తుతం 235తో కలిపి మొత్తం 1080 సెల్ ఫోన్లను రికవరీ చేసి వాటిని యజమానులకు అందించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఈ సమావేశం జిల్లా అదనపు ఎస్పి పి శ్రీనివాస్, మరో అదనపు ఎస్పి ఎం వెంకటేశ్వరరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు, కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్లు పి ఈశ్వరుడు, పి రామచంద్ర రావు, ఐటీ కోర్ ఎస్సై డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజ‌యం సాధించిన బీజేపీ కార్పొరేట‌ర్ల‌కు ఘ‌న స‌న్మానం

Sub Editor

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

సవాల్: ట్రిబ్యునల్ కు వెళ్లిన ఐపిఎస్ అధికారి ఏ బి

Satyam NEWS

Leave a Comment