28.7 C
Hyderabad
May 6, 2024 10: 04 AM
Slider ఆదిలాబాద్

మందు అమ్ముతారు కానీ మేం వ్యాపారం చేసుకోకూడదా?

#Nirmal Business men

హోమ్ క్వారంటైన్ ముగిసిన చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని జిల్లా మైనార్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ శుక్రవారం నాడు కోరారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడా వ్యాపారులు,మద్యం దుకాణా దారులకు ప్రభుత్వం అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు.

టెంట్లు వేసి మరీ  మద్యం అమ్ముతున్నారని అలాగే బ్యాంకుల ముందు టెంట్ వేసి కౌంటర్లు పెంచి మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. మద్యానికి అలవాటు పడినవారు ప్రభుత్వం ఇచ్చిన 1500 ను ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పేదల ఇల్లు గడిచే ఉపాయం చేయాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ మద్యం విక్రయించినప్పుడు, అలాగే సామాజిక దూరం పాటిస్తూ మసీదులో నమాజు, మందిరాల్లో పూజలు, చర్చిలో ప్రేయర్, గురుద్వారాలో ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ ని కోరారు.

తెలంగాణ వెబ్సైట్ లో తను చూసిన ప్రకారం అదిలాబాద్ రెడ్ జోన్లో లేదని, ఆరెంజ్ జోన్లో ఉందని హోమ్ క్వారంటైన్ ముగిసిన చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించాలని, లాక్ డౌన్లో పట్టుబడిన లక్షకుపైగా ఉన్న బైకులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ను సీఎం కేసీఆర్ ను కోరారు. గాంధీ హాస్పిటల్ నుండి నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన వారి ఇంటి దగ్గరే పికెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు. మిగతావారైన క్వారంటైన్ ముగిసిన చిలుకూరి లక్ష్మీ నగర్, అంబేద్కర్ నగర్, ఖానాపూర్ వాసులకు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. ఇందులో మహమ్మద్ షకీల్,అరఫాత్ ఖాన్ పాల్గొన్నారు.

Related posts

అధ్యాపకులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

అమరావతి ల్యాండ్ స్కాం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు

Satyam NEWS

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS

Leave a Comment