27.7 C
Hyderabad
May 7, 2024 07: 07 AM
Slider వరంగల్

గిరిజన బాలికలకు ఉచిత ఇంజనీరింగ్ శిక్షణ

#satyavatirathod

గిరిజన సంక్షేమ శాఖ, అమెజాన్ ఎడ్యుకేషన్ ఇనీషిఏటివ్స్ సంస్థ  వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూమ్ మీటింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 స్కూళ్లలో చదువుతున్న 15 వేల మంది గిరిజన బాలికలకు ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్న సంస్థను మంత్రి అభినందించారు.

ప్రత్యేక సాఫ్ట్ వేర్  ద్వారా  అందిస్తున్న ఈ శిక్షణతో, విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానమే కాకుండా, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తెలుగు సబ్జెక్టుల కూడ నేర్చుకోవడం ఇంకా సులభం అవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 50 స్కూళ్లలో నడుస్తున్న ఈ ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను, అమెజాన్ సంస్థ వారు మరొక 200 స్కూళ్లలో ఈ శిక్షను ప్రారంభిస్తారని అన్నారు.

గిరిజన ప్రాంతాల్లోని బాలికలకు ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తోపాటు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక,శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్వర కుమార్ లలిత్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వేర్ రెడ్డి, డిప్యూటీ డైరక్టర్ ఎం. ఎర్రయ్య, ఏ టి డి ఓ సత్యవతి, అమెజాన్ ప్రతినిధులు రాజ్ శశాంక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ నుండి తనుశ్రీ ,రణధీర్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంజక్షన్ వికటించి యువకుడు మృతి

Bhavani

ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ “సెల్ఫిష్” ఘనంగా ప్రారంభం

Satyam NEWS

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్ధికి పొంచిఉన్న గండం

Satyam NEWS

Leave a Comment