33.2 C
Hyderabad
May 4, 2024 02: 29 AM
Slider

ఓ రైతు, పాస్ బుక్ సమస్య, ఒక పెట్రోలు బాటిల్

mangalagiri

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ పై ఓ రైతు పెట్రోల్‌ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో సిబ్బంది ప్రతిక్షణం ఆందోళనతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటన నాటి నుంచి కొందరు ఎమ్మార్వోలు పోలీసుల రక్షణ కోరగా, మరికొందరు ఎమ్మార్వోలు మాత్రం అర్జీదారులు తమ దగ్గరకు చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ రైతు హల్‌చల్ చేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.శివ కోటేశ్వరరావు అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం నేడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన శివ కోటేశ్వరరావు నేడు ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు. అయితే దీనిని గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

9 నుంచి చిరంజీవి, కొర‌టాల శివ `ఆచార్య‌`షూటింగ్‌

Satyam NEWS

గుణపాఠం నేర్చుకుంటారా? కుట్ర రాజకీయాలు చేస్తారా?

Satyam NEWS

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS

Leave a Comment