తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే అమలు పరచి కొల్లాపూర్ కోట ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులను ఆపివేయాలని అఖిలపక్ష కమిటీ మునిసిపల్ కమిషనర్ వెంకటయ్య ను కోరింది. ఈమేరకు అఖిలపక్షం నేడు వెంకటయ్యను కలిసింది. టీపీసీసీ కార్య నిర్వహణ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పర్మిషన్ ఇచ్చారని, గతంలో ఉన్న కమిషనరు చేయని పని మీరు చేశారని అన్నారు. అక్కడ కళ్యాణ మండపం గణేష్ ఉత్సవాలు, బతుకమ్మ ఆటలు పాటలు, సంబరాలు వాహనాల పార్కింగ్ ప్రజలకు సౌకర్యంగా ఉన్నదని అలాంటి ప్రాంతాన్ని ప్లాట్లకు ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. బంగ్లా చుట్టూ ఉన్న ఖాళీ స్థలం అలాగే ఉంచాలని అఖిలపక్షం తరఫున ఉద్యమాలు చేయడానికి వెనుకాడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, టిఆర్ఎస్ తాలూకా ప్రచార కార్యదర్శి పసుపుల నర్సింహ, సీపీఎం నాయకులు శివవర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, ఎండి బాబా, మోజర్ల గోపాల్, పుట్టపాగ నరసింహ, కె.ధర్మ తేజ,రాందాస్ పాల్గొన్నారు.
previous post