39.2 C
Hyderabad
May 4, 2024 21: 47 PM
Slider మహబూబ్ నగర్

26 ఏండ్ల కృషికి దక్కిన ఫలితం…..

#pandu

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్లుగా 26 సంవత్సరాలుగా కృషి పట్టుదల తో తన వృత్తి లో నిబద్ధతను చాటుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ బలహీన వర్గాల కుటుంబం నుంచి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన డి.ఎల్ పాండు ముదిరాజు కు రాష్ట్ర నలుమూలల నుండి బహుజనుల లతో పాటు అనేక వర్గాల ప్రజల,  ఉపాధ్యాయుల నాయకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన డిఎల్ పాండు ముదిరాజు హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా వాసులందరు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు దగ్గరకు వెళ్లి రోహిత్ నాయక్ కలిసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారురు. డిఎల్ పాండు ముదిరాజు గతంలో ఉమ్మడి రాష్ట్ర న్యాయస్థాన సంఘం ప్రధాన కార్యదర్శి గా, బార్ కౌన్సిల్ సెక్రటరీ గా, ఫిషరీష్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా, ఫుడ్ కార్పొరేషన్ సభ్యులుగా, ఇంటర్ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులను చేపట్టడం జరిగింది. సుప్రీం కోర్టులో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు చేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరిస్తూ 2010 లో బీసీ కమిషన్లు బీసీ డి సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

హైకోర్టు ఆవరణలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్ పాండు ముదిరాజు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలుపడం జరిగింది. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గా డిఎల్ పాండు ముదిరాజు ఎంపికపట్ల స్టేట్ డిప్యూటీ జనరల్ సేక్రటరీ రాత్లవత్ రోహిత్ నాయక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పేదల కాలనీలు పట్టించుకోని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Satyam NEWS

కరోనా కట్టడిలో విఫలమైన ఏపిలో కేంద్రం జోక్యం

Satyam NEWS

Leave a Comment