38.2 C
Hyderabad
April 27, 2024 15: 53 PM
Slider ప్రత్యేకం

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

#warangalpolice

సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలు సూచించారు. ‘సంక్రాంతి పండుగ దృష్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేశారు.

సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీస్ కమిషనర్ చేస్తున్న సూచనలు

ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.

ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.

విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.

ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.

బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.

గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.

ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి.

పని మనుషులు ఉంటే రోజూ ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలి.

విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.

ఇంటి డోరకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.

వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సిసి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ

మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్ ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది.

ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి.

పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి.

ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం

అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.

అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా వరంగల్ పోలీస్ కమీషనరేట్ వాట్సాప్ నెంబర్ 9491089257 కు సమాచారం ఇవ్వాలి.

Related posts

పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితుడిపై దాడి

Satyam NEWS

అజ్మీర్ దర్గాను సందర్శించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Bhavani

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment