33.7 C
Hyderabad
April 30, 2024 02: 39 AM
Slider హైదరాబాద్

దళారుల మాటలు నమ్మి దళితులు మోసపోవద్దు

#kcr

దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది మధ్యవర్తులు లక్షా 50 వేల రూపాయలు నుండి 2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారన్ని అటువంటి దళారుల మాటలు నమ్మి దళితులు ఎవరు మోసపోవద్దు తెరాస పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ గౌడ్ పేర్కొన్నారు. కొంత మంది నాయకులు టిఆర్ఎస్ పార్టీని బద్నాం చేయొద్దని అర్హులైన అందరినీ గుర్తించి ఖచ్చితంగా పేదవాళ్లకు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందని గుర్తు చేశారు.

తొందరపడి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని చెప్పి తెలియజేశారు. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగితే ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయాలని కోరారు. అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ దళిత సోదరులకు పేరుపేరునా అందరికీ ఒక విషయం తెలియజేస్తున్న అంతేకానీ భయపడి ఇంట్లో కూర్చుంటే మీరే మోసపోతారుని ధైర్యంతోని ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

బాగ్ అంబర్పేట్ డివిజన్లో ఒక వ్యక్తి చెప్పిన వాళ్లకు నాలుగు అయిదు వరకు ఇచ్చారని, ఇంతకుముందు ఫస్ట్ లిస్టులో చేసినటువంటి పొరపాట్లు మళ్లీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోతాయి అరే అతను చెప్తేనే వస్తది ఏమో లేకుంటే రాదేమో అని చెప్పి ప్రజలు భయభ్రాంతులై వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేస్తారు కాబట్టి మనమే అరులైన వాళ్లను గుర్తించి ఇయ్యాలని తెలియజేశారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఎనదర్ యాంగిల్: కోవిడ్ పేరుతో హక్కుల అణచివేత

Satyam NEWS

మంత్రి పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వంగవీటి రాధ

Satyam NEWS

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

Leave a Comment