38.2 C
Hyderabad
May 2, 2024 19: 55 PM
Slider గుంటూరు

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

#APSRTC

ఏపీఎస్ఆర్టీసీ లో రవాణా సరుకుల చార్జీలు తగ్గించినట్లు గుంటూరు జిల్లా నరసరావుపేట డిపో మేనేజర్ ఎస్.కె అబ్దుల్ సలామ్ తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు ఉన్న సరుకు రవాణా చార్జీలను 50శాతం మేరకు తగ్గించారు.

తగ్గిన రవాణా చార్జీల వివరాలు ఇవి: 10టన్నుల లోడ్ కు 200 వందల కిలోమీటర్ల వరకు కిలోమీటరు కు 50 రూపాయలు, 201నుంచి 300 కిలోమీటర్ల వరకు కిలోమీటరు కు 49 రూపాయలు,  301 నుండి 400 వరకు కిలోమీటరు కు 48 రూపాయలు, 401 నుండి 500 వరకు కిలోమీటరు కు 47 రూపాయలు, 501నుండి 600 వరకు 46 రూపాయలు,

601 నుండి 800 వరకు కిలోమీటరు కు 45 రూపాయలు, 801 నుండి 900 వరకు కిలోమీటరు కు 44 రూపాయలు, 901 నుండి 1000 వరకు 43 రూపాయలు,  1001 నుండి 1100 వరకు కిలోమీటరు కు 42 రూపాయలు,  1101 నుండి 1200 వరకు కిలోమీటరు కు 41 రూపాయలు, 1200 వందల  కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నా కూడా కిలోమీటరు కు 40 రూపాయల వరకు తగ్గించారు.

500 కేజీల పైబడిన ప్రతి సరుకును పార్ట్ లోడుగా అనుమతిస్తారు. 3 టన్నుల పైన లోడు ఉంటే ఫ్రీ పిక్ అప్ ఏర్పాటు చేస్తామని నరసరావుపేట డిపో మేనేజర్ ఎస్.కె అబ్దుల్ సలామ్ తెలిపారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులలో

రూఫ్ టాప్, డిక్కిలు నెలవారి, రోజు వారి పద్ధతిన సరుకుల రవాణా కు అద్దెకు ఇస్తారు. 24 గంటలలో రాష్ట్రంలోని ఏ ప్రదేశానికి అయినా డెలివరీ ఇస్తారు.

రవాణాకు సంబంధించిన మిర్చి, పత్తి, ధాన్యం, కందులు, బియ్యం, మందులు, పచ్చి సరుకు అయిన కూరగాయలు, పండ్లు, ఇంటి సామాన్లు బదిలీ చేయడం తదితర వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి త్వరిత గతిన అత్యంత భద్రతతో రవాణా చేస్తామని ఆయన తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: DM 9959225428, ATM 7331147265, TI 7382860415, DME 7382896125

Related posts

జనహిత శోభావళి

Satyam NEWS

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

Satyam NEWS

విశాఖపట్నం పోర్టు ట్రస్టు ను సందర్శించిన ఆదిత్య మిట్టల్

Satyam NEWS

Leave a Comment